స్పైస్ జెట్ విమానం టేకాఫ్‌కి కొన్ని క్షణాల ముందు..
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ఉదయం ఎనిమిదిన్నరకు 60 మంది ప్రయాణికులతో విమానం రన్‌వే నుంచి బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంది. టేకాఫ్‌కి కొన్ని క్షణాల ముందు గాల్లోకి లేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్ల నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన పైలెట్ వెంటనే ఫ్లైట్‌ను నిలిపేశారు. మెల్లిగా దాన్ని టెర్మినల్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది కదల్లేదు. దీంతో ఫైర్ సిబ్బంది ట్రాక్టర్ సాయంతో దాన్ని పాత టెర్మినల్ బిల్డింగ్ వద్దకు లాక్కుని వచ్చారు. తర్వాత ప్యాసెింజర్లను దింపేందుకు ప్రయత్నించినా డోర్లు తెరుచుకోలేదు. కాసేపు కుస్తీపట్టాక చివరికి ఓపెన్ అయ్యాయి. దాదాపు అరగంటపాటు ఏం జరుగుతుందో అర్థంకాక ప్యాసింజర్లంతా కంగారు పడ్డారు. చివరికి ఫ్లైట్ దిగాక ఊపిరి పీల్చుకున్నారు. ఇదే ఫ్లైట్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు పలువురు వీఐపీలు ఉన్నారు. సాంకేతిక సమస్య ఎందుకొచ్చింది, ఏం జరుగుతుందో అర్థం కాక అంతా టెన్షన్ పడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com