కీలక బిల్లుల ఆమోదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు
కీలక బిల్లుల ఆమోదం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసమావేశాల్లో పలు కీలకమైన చట్టాలకు సంబంధించి సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఇందులో భాగంగా ఈరోజు మంత్రి మండలి సమావేశమవుతోంది.. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించనున్నారు.. ఉదయం 8 గంటలకు అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. దాదాపు 12 సవరణ బిల్లులును సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.. వీటన్నిటికీ ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
లోకాయుక్తకు హైకోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించేలా చట్ట సవరణ తీసుకురానుంది ప్రభుత్వం.. అలాగే జ్యుడీషియల్ కమిషన్ నియామకం కోసం ఏపీ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ చట్టాన్ని సవరించనుంది.. కీలకమైన ఇంజినీరింగ్ ప్రాజెక్టులో సమీక్ష కోసం ఈ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలనుకుంటోంది ప్రభుత్వం. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి కమిషన్లు ఏర్పాటు చేసేందుకు కొత్త బిల్లును తీసుకొస్తోంది.. హిందూ ధార్మిక చట్టానికి కూడా సవరణలు చేస్తోంది.. వీటన్నిటికీ కేబినెట్‌లో ఆమోదం తెలుపనున్నారు.. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com