రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ - చంద్రబాబు
BY TV5 Telugu18 July 2019 6:40 AM GMT

X
TV5 Telugu18 July 2019 6:40 AM GMT
కరకట్టపై తాను ఉంటున్న లింగమనేని హౌస్‌కు 2007లోనే వైఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు. వైఎస్ విగ్రహాల ఏర్పాటుపై తనకు ఎలాంటి ద్వేషం లేదని శాసనసభలో ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి.. తాను బెస్ట్ ప్రెండ్స్ అని చెప్పారు చంద్రబాబు. తామిద్దరం ఒకే రూంలో ఉన్నామని గుర్తు చేశారు. తమ మధ్య రాజకీయ విరోధం తప్ప .. వ్యక్తిగతంగా లేవన్నారు. జగన్ ప్రభుత్వం తనపై కోపంతో కరకట్టపై ఉన్న 74 వేల ఇళ్లు కూల్చుతామని చెబుతుందని విమర్శించారు. ఉన్నపలంగా ఇల్లు కూల్చివేస్తే అనేక కుటుంబాలు రోడ్డున పడతాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో రావాలని కోరారు.
Next Story