వారు సభకు రాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం సరికాదు - చంద్రబాబు

వారు సభకు రాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం సరికాదు - చంద్రబాబు

మంత్రులు సభకు రాలేదని అసెంబ్లీని వాయిదా వేయడం సరికాదని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తచేశారు. మంత్రి వర్గ సమావేశం ఉంటే సభను వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు. ఇది శాసనసభను తక్కువ చేసి చూపించినట్లు అవుతోందని పేర్కొన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు .ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని స్పీకర్‌ను కోరారు చంద్రబాబు.

సభాపతిగా అందిరి హక్కులను కాపాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు చంద్రబాబు. అధికార , ప్రతిపక్షాలను సమాన దృషి చూడాలని కోరారు. అధికార పార్టీ సభ్యులు తమపై ఎన్ని ఆరోపణలు చేసిన ప్రజల కోసం పడతామన్నారు చంద్రబాబు.

Tags

Next Story