‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

రామ్ ఎనర్జీనిపూర్తిస్థాయిలో వాడగలిగే మాస్ డైరెక్టర్ పూరి ఇస్మార్ట్ శంకర్ ని డబుల్ డోస్ మాస్ ఎంటర్ టైనర్ గా మార్చాడు. ట్రైలర్, పాటలతో మాస్ ఎంటర్ టైనర్ అనే ఇంప్రెషన్ కలిగించిన పూరి బ్రాండ్ ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉన్నాడో చూద్దాం...

కథ:

శంకర్ (రామ్ ) ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఒక పెద్ద పొలటిషన్ ని చంపుతాడు. అతని వెంట పడిన గ్యాంగ్ చేసిన కాల్పులలో అతని లవర్ చాందిని (నభా నటేష్ ) చనిపోతుంది. శంకర్ పగ తీర్చుకునే క్రమంలో అతని కి ఒక సిబిఐ ఆఫీసర్ బ్రెయిన్ మెమరీని శంకర్ మెదడులో ట్రాన్సఫర్ చేస్తారు. డబుల్ ధిమాక్ శంకర్ తన పగను ఎలా తీర్చుకున్నాడు..? సి.బి.ఐ. ఆఫీసర్ లా మారిన శంకర్ ఏం చేసాడు అనేది మిగిలిన కథ..?

కథనం:

కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ని కథలో భాగం చేసుకొని పూరి చేసిన ఇస్మార్ట్ శంకర్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. సినిమా లో కనిపించేది , వినిపించేది చివరకు గుర్తుండేది కూడా రామ్ మాత్రమే. అంతగా ఈసినిమాని ఓన్ చేసుకున్నాడు రామ్. అతని బాడీ లాంగ్వేజ్ నుండి డాన్స్ లలో కనిపించిన ఊపు చూసి మాస్ సినిమాల రుచి మరోసారి గట్టిగా తగిలింది. టైటిల్ సాంగ్ లో మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి రామ్ చేస్తున్న డాన్స్ లు ఇచ్చిన కిక్ మాములుగా లేదు. రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగింది నభా మాత్రమే. నన్నదోచుకుందువతే తో చలాకీ పిల్లగా కనిపించిన నభా ఇందులో ఇస్మార్ట్ ని కంట్రోల్ చేసే అంత డామినేటింగ్ క్యారెక్టర్ చేసింది. జిందాబాద్... బోనాలు పాటలలో నభా చూపించిన గ్రేస్ కమర్షియల్ హీరోయిన్ గా నభా కు ఉండే స్కోప్ ని పరిచయం చేసాయి. ఇక క్యారెక్టర్ లో ఫోర్స్ ని రామ్ ఓన్ చేసుకొని పూర్తిగా ఇస్మార్ట్ గా మారిపోయాడు.. ‘ మామా జ్ఞాన్ మత్ దేనా’ అంటూ పక్కా హైదరాబాదీ లాంగ్వేజ్ లో ఇరగదీసాడు. క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యాక అతని ట్రావెల్ వచ్చే మలుపులు కన్నా అతను ఆ మలుపులలో రియాక్ట్ అయ్యే తీరు ఎంటర్ టైన్ చేస్తుంది. అదే ఇస్మార్ట్ శంకర్ లో బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఒకరి మెమరీస్ ని మరొకరికి ట్రాన్స్ ఫర్ చేయడం వంటి సైంటిఫిక్ కాన్సెప్ట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించడంలో పూరి ఆడియన్స్ బాగా ఎంటర్ టైన్ చేసాడు. ఇస్మార్ట్ శంకర్ కి సిబిఐ ఆఫీసర్ మెమరీస్ ని ట్రాన్స్ ఫర్ చేసాక అతని క్యారెక్టర్ ఎలా మారుతుంది..? ఎప్పుడు ఎలా ఉంటుంది..? ఎవరితో ఎలా రియాక్ట్ అవుతుంది..? అనే సర్ ప్రైజస్ ని బాగా డిజైన్ చేసాడు..? సిబిఐ ఆఫీసర్ లవర్ తో నువ్వెందుకు నాకు గుర్తొస్తున్నావ్..? నువ్వు నాకు వద్దు.. అంటూ శంకర్ చెప్పే సన్నివేశం లో ఆ క్యారెక్టర్ లో ని పెయిన్ ని ప్రజెంట్ చేసాడు పూరి. ఇంకా అడ్డదిడ్డంగా కనిపించే శంకర్ తను ప్రేమించిన అమ్మాయి మెమరీస్ దూరం అవుతున్నాయని బాధపడే సీన్ బాగా డిజైన్ చేసాడు..? ప్రేమించిన అమ్మాయి దూరం అయితే కలిగే పెయిన్ తెరపై కొత్తేమీ కాదు కానీ ఆ అమ్మాయి మెమరీస్ దూరం అవుతున్నాయని పడే బాధ కొత్త గా అనిపించింది. సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేసాడు. కానీ తన మెమరీస్ ఛేంజ్ అయితే సడన్ గా ఇంగ్గీష్ ఎలా వస్తుందనే డౌట్ కొడుతూనే ఉంది. అప్పటి వరకూ ఇస్మార్ట్ బాషకు అలవాటు పడిన ప్రేక్షకుడికి రామ్ కొత్తగా కనిపించాడు.

కథా, కథనాలు విషయంలో పెద్ద విషయం లేకపోయినా, పూరి మార్క్ డైలాగ్స్, రామ్ ఎనర్జీ, కిక్ ఎక్కించే పాటలు.. ఊపు తెచ్చే స్టెప్స్ తో ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఫీస్ ని గెలుస్తాడానడంలో సందేహం లేదు...

చివరిగా:

డబుల్ మాస్

Tags

Read MoreRead Less
Next Story