ఒకరితో ఒకరు పోటీ పడ్డ సితార, ఆద్య

ఒకరితో ఒకరు పోటీ పడ్డ సితార, ఆద్య

పిల్లలు చేసే అల్లరి పనులు.. ఆట పాటలు అన్నీ ఈ మధ్య యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నారు తల్లిదండ్రులు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార చేసే క్యూట్ అల్లరిని అభిమానుల కోసం పోస్ట్ చేస్తుంటాడు. అయితే, తాజాగా సితార, దర్శకుడు పైడిపల్లి వంశీ కూతురు ఆద్య కలిసి ఏ అండ్ ఎస్ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ ప్రారంభించారు.ఈ చానల్‌లో తొలి వీడియోను ఈ రోజు పోస్ట్ చేశారు. 3 మార్కర్స్ చాలెంజ్ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సితార, ఆద్యలు బొమ్మలకు కలర్స్ ఫిల్ చేయడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 30 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. సితార, ఆద్యల వీడియోను తన పేజ్‌లో పోస్ట్ చేసిన మహేష్.. చిన్నారులిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read MoreRead Less
Next Story