తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు ఎవరిపేరుతో ఉంది : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌

తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు ఎవరిపేరుతో ఉంది : ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌

టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న అద్దె ఇంటిపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌. 2006లోనే ఆ ఇంటి ఫ్లాన్‌కు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. తన తండ్రి వైఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కూడా సీఎం జగన్ తప్పుపడుతున్నట్లేనా.. అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్‌ ఉంటున్న ఇల్లు ఎవరిపేరుతో ఉంది.. ఆఇంటి పన్ను ఎవరి పేరుతో కడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బాబూ రాజేంద్రప్రసాద్.

Tags

Next Story