పాలు పదినిమిషాలు మరగబెడితే..

పాలు పదినిమిషాలు మరగబెడితే..

స్కూలుకి టైమవుతోంది. పిల్లాడు పాలైనా తాగి వెళతాడని తల్లి హడావిడిగా పాలు కాచి అందులో హార్లిక్సో, బూస్టో కలిపి ఇస్తుంది. ఎంత టైమ్ అయిపోతున్నా కనీసం పది నిమిషాలైనా పాలు కాచమంటున్నారు శాస్త్రవేత్తలు. లేకపోతే పాలల్లో ఉన్న హానికారక రసాయనాలు కడుపులోకి వెళ్లిపోతాయి. తెలంగాణ పశువైద్య యూనివర్శిటీ పరిశోధకులు పాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడించారు. పురుగు మందులు చల్లిన పశుగ్రాసం తినడం వలన గేదెలు, ఆవులు ఇచ్చే పాలల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని తెలుసుకున్నారు. కలుషిత నీరు, మందులు వాడిన పశుగ్రాసం తినడం వల్ల పాలు విషతుల్యం అవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. అందుకే కనీసం పది నిమిషాలైనా మరగబెట్టని పాలు తాగితే అల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు. రెండు పొంగులు రాగానే స్టవ్ కట్టేయకుండా కొద్ది సేపు మరిగించితే మంచిదని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story