ఘోర రోడ్డు ప్రమాదం..చైల్డ్ ఆర్టిస్ట్‌ దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం..చైల్డ్ ఆర్టిస్ట్‌ దుర్మరణం

ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివలేఖ్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. పలు హిందీ ధారవాహికల్లో నటించిన శివలేఖ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ వివరాల ప్రకారం శివలేఖ్ ఫ్యామీలి కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. వీరిలో్ శివలేఖ్ తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘సంకట్‌ మోచన్‌ హనుమాన్‌’, ‘ససురాల్‌ సియర్‌ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో శివలేఖ్‌ కనిపించారు. బాలనటుడి మృతితో ఇతర టీవీ అర్టిస్టులు విచారం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story