ఆంధ్రప్రదేశ్

పీపీఏల రద్దు వివాదంపై క్లారిటీ..

పీపీఏల రద్దు వివాదంపై క్లారిటీ..
X

ఏపీ డిస్కమ్‌ - గ్రీన్‌కో ఎనర్జీ గ్రూప్‌ మధ్య నెలకొన్న PPA ల రద్దు వివాదంపై క్లారిటీ వచ్చింది. గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన 3 సంస్థల్లో టారిఫ్‌లపై అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ స్టే ఇచ్చింది పాత కేసు విషయంలో అని వెల్లడైంది. 2018లో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ 3 సోలార్ పవర్ కంపెనీలకు నోటీసులు పంపింది. ధరలు తగ్గించాలని కోరింది. దీన్ని సవాల్ చేస్తూ గ్రీన్‌ఫ్లాష్, ఆరుషి, రెయిన్‌కోక్‌లు ట్రైబ్యునల్‌కు వెళ్లాయి. దానిపై వాదనల నేపథ్యంలో స్టే వచ్చింది. ఐతే కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈనెల 12న గ్రీన్‌కో గ్రూప్‌నకు APSPDCL నుంచి పీపీఏలపై నోటీసులు అందాయి. ఇదే విషయంపై గ్రీన్‌కో సంస్థ ట్రైబ్యునల్ కు వివరణ ఇచ్చింది. టారిఫ్ రేట్లు ఖరారు చేసే హక్కు డిస్కమ్‌లకు ఉండదని చెప్తూ గతంలో కేసు పెండింగ్ ఉన్న విషయాన్ని ప్రస్తావించింది.

ఆ వివాదం తేలే వరకూ PPAలపై యథాతథ స్థితి కొనసాగించాలని కోరింది. రాజస్థాన్‌లో ఉన్నట్టుగానే యూనిట్ ధర ఉండాలని.. ఆ ధరను 2 రూపాయల 44 పైసలకు తగ్గించాలని డిస్కమ్‌లు చెప్పడంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే PPAల రద్దు వివాదంపై పాత కేసులను కొత్తగా చూపిస్తూ కొన్ని జాతీయ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు తప్పుడు కథనాలు రాశాయని విద్యుత్‌ రంగ నిపుణులు ఆరోపించారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ 3 సోలార్ పవర్ కంపెనీలకు 2018లో ఇచ్చిన నోటీసులేనని కొత్తగా ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టమైంది.

Next Story

RELATED STORIES