మాజీ మంత్రిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా : కేటీఆర్

మాజీ మంత్రిగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నా : కేటీఆర్

మున్సిపల్‌ చట్టం అద్భుతంగా ఉందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. అధికారులు తప్పు చేస్తే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రిగా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని తెలిపారు. ప్రజలమీద బాధ్యతతో వారికే అధికారం ఇస్తున్నామని, తప్పు చేస్తే 25 శాతం పెనాల్టీ కట్టాలన్నారు కేటీఆర్. 75 గజాలున్న పేదవాళ్లకు ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేస్తామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కచ్చితంగా మున్సిపల్‌ చట్టం గురించి తెలుసుకున్నాకే పోటీ చేయాలని సూచించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు స్థానిక ఎమ్మెల్యేలు బాధ్యులన్నారు కేటీఆర్‌. ఎన్నికలు అనుకున్న టైమ్‌కే జరుగుతాయన్నారు. శాసనసభలో శాసనాలు చేయడం గతంలో మరిచామని, ఇప్పుడు మొదలుపెట్టామన్నారు కేటీఆర్. హైదరాబాద్‌ మహానగరాన్ని ముంబై నగరంలా వికేంద్రీకరణ చేయాలనే ఆలోచన సీఎంకు ఉందన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం ఇప్పటికీ సానుకూలంగానే ఉందన్నారు.

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు స్పీడ్‌గా జరుగుతోందన్నారు కేటీఆర్‌. సభ్యత్వాల ద్వారానే పార్టీకి 7 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడంలేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనున్నారు కేటీఆర్. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ విషయం కోర్టులో ఉందని, దానిపై వ్యాఖ్యానించనన్నారు. ఇంటర్‌ బోర్డు విషయంలో తమ పార్టీపై నోటికివచ్చినట్టు మాట్లాడారని, అసలు ప్రతిపక్షానికి ఏ అంశాన్ని పట్టుకోవాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. డీఎస్‌ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడని, మరి కేంద్ర హోమ్‌ మంత్రిని ఎందుకు కలిశారో తెలియదన్నారు కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story