"ఇస్మార్ట్ శంకర్ " లో రామ్ - నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ కి మంచి రెస్పాన్స్

ఇస్మార్ట్ శంకర్  లో రామ్ - నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ కి మంచి రెస్పాన్స్

గురువారం విడుదలైన "ఇస్మార్ట్ శంకర్ " చిత్రంలో రామ్ - నభా నటేష్ క్యారెక్టరైజేషన్స్ & కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ముఖ్యంగా రామ్, నభా నటేష్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్, హెవీ డ్యాన్స్ మూవ్స్ & యాక్షన్ బ్లాక్స్ లో అతడు చూపిన ఈజ్ కి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుండగా.. వైవిధ్యమైన పాత్రలో నభా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. 'నన్ను దోచుకొందువటే'లో క్యూట్ గా ఆకట్టుకున్న నభా 'ఇస్మార్ట్ శంకర్'లో అల్ట్రా మాస్ యాటిట్యూడ్ & పెర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. రామ్-నభా ల మధ్య సాగే రొమాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్-నభా ల నడుమ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని భావించి పూరీ ముందు అనుకున్నదానికంటే కొన్ని సన్నివేశాలు ఎక్కువగా రాసాడట. రామ్-నభాల రొమాన్స్ మాత్రమే కాదు వారి కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటోంది. థియేటర్లో ఈ కాంబినేషన్ సీన్స్ ను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి శంకర్-చాందిని పాత్రలు ప్రేక్షకులకు కొన్నాళ్లపాటు గుర్తుండిపోతాయన్నమాట.

Tags

Read MoreRead Less
Next Story