యానిమేషన్ కంపెనీకి నిప్పంటించిన దుండగుడు

X
జపాన్లో ఓ వ్యక్తి అత్యంత దారుణమైన పనికి పాల్పడ్డాడు. ఆ దుండగుడు, ఓ యానిమేషన్ కంపెనీకి నిప్పంటించాడు. మండే స్వభా వం ఉన్న ద్రావణాన్ని భవనంపై చల్లడంతో మూడంతస్తుల భవవానికి మంటలు వ్యాపించాయి. ఈ హృద య విదారక ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 70 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
మొదటి అంతస్తులో మృతుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. అక్కడ ఊపిరాడక 12 మంది మృతి చెందినట్లు సమాచారం. కొందరు మంటల్లో పడి సజీవ దహనమయ్యారు. గాయపడిన 35 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
