రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది..

ప్రముఖ మొబైల్ సంస్థ షియోమి ప్రతిష్టాత్మకమైన రెడ్ మి K20, K20 Pro ఫోన్లను బిగ్ సీ ద్వారా ఏపీ, తెలంగాణ మార్కెట్‌లో విడుదల చేయడం తమకెంతో సంతోషంగా ఉందని బిగ్ సీ ఫౌండర్ బాలు చౌదరి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ బిగ్ సీ షోరూంలో రెడ్‌మీ K20, K20 Pro ఫోన్లను షియోమి సంస్థ ఎండీ మనుకుమార్ జైన్‌తో కలిసి బాలు చౌదరి ఆవిష్కరించారు. 48 మెగా పిక్సల్ త్రిబుల్ కెమెరా, 20 మెగా పిక్సల్ పోప్ అప్ సెల్ఫీ కెమెరాతో పాటు అత్యాధునిక ఫ్యూచర్స్ ఈ ఫోన్ లలో అందుబాటులో ఉన్నాయని మను కుమార్ తెలిపారు. ప్రముఖ బ్రాండ్ మొబైల్స్ అన్ని బిగ్ సీ ద్వారా మార్కెట్‌లోకి పరిచయం చేయడం అనవాయితీగా వస్తుందని బాలు చౌదరి అన్నారు.
రెడ్ మి K20,K20 Pro ఫోన్లను బిగ్ సీ ద్వారా ఏపీ,తెలంగాణ మార్కెట్‌లో విడుదల మాదాపూర్ బిగ్ సీ షోరూంలో K20,K20 ప్రో ఫోన్‌లను విడుదల చేసిన బాలు చౌదరి బిగ్ సీ ద్వారా మొబైల్స్ విడుదల చేస్తే ప్రజలకు మరింత చేరువఅవుతుంది-మను కుమార్ జైన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com