జగన్ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి : బాబూ రాజేంద్రప్రసాద్

రైతుల ఆత్మహత్యపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల ఆత్మహతలపై చర్చ వచ్చింది. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్. రైతులు చనిపోయిన తర్వాత నష్టపరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం మొసలీకన్నీళ్లు కారుస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసిన రుణమాఫీ నిధులను జగన్ సర్కార్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బాబూ రాజేంద్రప్రసాద్.
గత ప్రభుత్వ నిర్ణయాల వలనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు మంత్ర బొత్స సత్యనారాయణ. 2014 - 19 మధ్య కాలంలో 1360 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వారిలో 420 మందికి పరిహారం ఇచ్చినట్లు వెల్లడించారు. మిగతా వారికి తమ ప్రభుత్వం తరుపున ఏడు లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆత్మహత్యలు లేకుండా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి బొత్స .
గత టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే.. దానిని జగన్ సర్కార్ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీసీ సభ్యులు. ఆ రుణమాఫీ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com