నీతో గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం: మహేష్ ఎమోషనల్ పోస్ట్

నీతో గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం: మహేష్ ఎమోషనల్ పోస్ట్

అర్థం చేసుకునే ఇల్లాలు.. ముద్దులొలికే ఇద్దరు చిన్నారులు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనేంటో నిరూపించుకున్నాడు.. తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు అందాల రాకుమారుడు మహేష్ బాబు. తన క్యూట్ బంగారు సితార ఏడో పుట్టిన రోజు సందర్భంగా తనను స్పెషల్‌గా విష్ చేస్తూ.. ఇప్పటి వరకు చిట్టి తల్లి దిగిన ప్రతి ఏడాది ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు మహేష్. హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ. కాలం చాలా వేగంగా పరుగులు పెడుతోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకెంతో ప్రత్యేకం. నీ జీవితం ప్రేమ, సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నా. దేన్నైనా పాజిటివ్‌గా తీసుకుంటావని ఆశిస్తున్నా. ఆ దేవుడి ఆశీర్వాదాలు నా బంగారు తల్లికి ఎప్పుడూ ఉంటాయని నమ్ముతున్నా. నేను నాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నా.. అని మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఆయన భార్య నమ్రత కూడా చిట్టి తల్లికి శుభాకాంక్షలు చెబుతూ సితారను విష్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. అందమైన మహిళగా ఎదగాలని.. మంచి నిర్ణయాలు తీసుకుని నచ్చిన మార్గంలో పయనించాలని అన్నారు. కుటుంబం ఎప్పుడూ నీ వెంటే వుంటుందని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం కశ్మీర్‌లో ఉన్నారు. సితార బర్త్‌డే సందర్భంగా నమ్రత, గౌతమ్, సితారలు కూడా కశ్మీర్ వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story