ఆ విమర్శలు బాధించాయి.. అభిమానులకు నటుడు సూర్య లేఖ

ఆ విమర్శలు బాధించాయి.. అభిమానులకు నటుడు సూర్య లేఖ

నీట్‌ వివాదంపై అభిమానులకు ఎమోషనల్‌గా లేఖ రాశారు నటుడు సూర్య. నీట్‌ పరీక్షపై తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడం బాధించిందన్నారు. తనకు భారతీయుడిగా మాట్లాడే హక్కు ఉందని.. విద్యా విధానంపై ప్రశ్నించే హక్కు కూడా ఉందన్నారు సూర్య. విద్యా విధానంలో లోపాల గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యావిధానంపై నటుడు సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇటీవల శివకుమార్‌ విద్యా ట్రస్టు, సూర్య అగరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉత్తీర్ణత పొందిన 10వ తరగతి పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న సూర్య.. కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా అమల్లోకి తీసుకురానున్న విద్యావిధానంపై ఘాటుగా విమర్శించారు. ఇది విద్యార్థులకు నష్టం చేసేదిగా ఉందని ఆరోపించారు.

అయితే సూర్య వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించగా.. మరికొంత మంది స్వాగతించారు. సూర్య వ్యాఖ్యలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. సూర్య వ్యాఖ్యలు నిరసిస్తూ కొన్ని సంఘాలు జ్యోతిక సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో అభిమానులకు భావోద్వేగంతో లేఖ రాశారు సూర్య.

Tags

Read MoreRead Less
Next Story