ధోనీ వికెట్‌కీపింగ్ బాధ్యతలు అతనికే !!

ధోనీ  వికెట్‌కీపింగ్ బాధ్యతలు అతనికే  !!

టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు మాత్రం ధోని ఉండాలనుకుంటున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి జాతీయ వార్త సంస్థతో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ రాబోయే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేస్తాడని అధికారి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎప్పుడో ధోనీ తీసుకున్నాడని అందుకే విండీస్ పర్యటనకు దూరంగా ఉంటున్నాడని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీతో, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు అధికారి తెలియజేసినట్లు సమాచారం. ధోనీ స్థానంలో రిషభ్‌పంత్‌కు వికెట్‌కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Tags

Next Story