ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తానని 400 మందిని బురిడికొట్టించిన కేటుగాడు..

విశాఖపట్నంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. పేదలకు ప్రభుత్వ ఇళ్లు ఇప్పిస్తానంటూ... బొత్సా ప్రశాంత్ కుమార్ అనే కేటుగాడు.. జనాన్ని బురిడికొట్టించాడు. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశాడు. ఇలా దాదాపు 4 వందల మంది నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. జనాన్ని నమ్మించేందుకు.. GVMC కమిషనర్, SBI అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి పక్కా స్కెచ్‌తో.. కోట్ల రూపాయలు లూటీ చేశాడు.
డబ్బులు ఇచ్చినా... తమకు ఇళ్లు రాకపోవడంతో మోసపోయామని గుర్తించారు బాధితులు. దీంతో స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ కేసును అటు పోలీసులు కానీ. .ఇటు GVMC అధికారులు కానీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ GVMC గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు బాధితులు. ఈ కేసులో గతంలోనే ప్రశాంత్ కుమార్‌ను అదుపులో తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతను బెయిల్ మీద బయటికి వచ్చాడు. తాము అప్పులు చేసి ప్రశాంత్‌కుమార్‌కు డబ్బులు కట్టామంటున్న బాధితులు.. తక్షణమే అతన్నుంచి డబ్బులు వసూలు చేయించాలని కోరుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

