కస్టడీలోకి కోగంటి సత్యం
రాంప్రసాద్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. రాంప్రసాద్ మర్డర్ కేసులో మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా..వారి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీ కోరారు పోలీసులు. పోలీసుల కస్టడీ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్తానం 7 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
దాదాపు 23 కోట్ల రూపాయల విలువైన భూ వివాదంలో పారిశ్రామికవేత్త రాంప్రసాద్ ను పథకం ప్రకారం హత్య చేయించాడు కోగంటి సత్యం. రాంప్రసాద్ హత్యకు శ్యామ్‌ను పురమాయించాడు. ఇందుకోసం అతనికి 3 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. రాంప్రసాద్‌ను హతమార్చేందుకు నెల రోజులు రెక్కీ నిర్వహించారు. 6 మారణాయుధాలు ఉపయోగించి హత్యచేశారు.
కేసు దర్యాప్తు ముమ్మరం కావటంతో రాంప్రసాద్ ను తనే హత్య చేసినట్లు శ్యామ్ తెరమీదకు వచ్చాడు. అయితే..ఈ హత్య వెనక కోగంటి సత్యం హస్తం ఉందని విశ్వసించిన పోలీసులు.. పక్కా సాక్ష్యాలతో అతన్ని అరెస్ట్ చేశారు. కోగంటిపై ఇప్పటికే 21 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే..కోగంటితో పాటు కేసులో మిగిలిన నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మర్డర్ కు మరేమైనా కారణాలు ఉన్నాయా..ఎవరెవరి హస్తం ఉంది అనే అంశాలపై ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com