కేటీఆర్ ఔదార్యం.. చిన్నారి ఆపరేషన్ కు సాయం..

కేటీఆర్ ఔదార్యం.. చిన్నారి ఆపరేషన్ కు సాయం..
X

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. గుండెకు రంధ్రం పడిన ఓ చిన్నారి ఆపరేషన్ కు సహకరిస్తానని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసరా పింఛన్లు పెరిగినట్లు ఉత్తర్వులను అందజేసి వెళ్తున్న సమయంలో కేటీఆర్ దగ్గరికి ఎనిమిదేళ్ల బాలుడు నవనీత్ వచ్చాడు. పేపర్ పై తన సమస్యను రాసి కేటీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. బాలుడ్ని గమనించిన కేటీఆర్ నవనీత్ దగ్గరికి వెళ్లి అతని తల్లిని సమస్యను అడిగితెల్సుకున్నారు. గుండెకు రంధ్రం పడిందని..ఆపరేషన్ కు ఐదు లక్షల అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారామె. తమకు స్థోమత లేదని వాపోయింది. దీంతో స్థానిక కౌన్సిలర్ ను పిలిచిన కేటీఆర్..నవనీత్ ను హైదరాబాద్ కు తీసుకురావాలని..అక్కడ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్.

Tags

Next Story