ఛార్మికి బీరు పోసిన వర్మ(వీడియో)

ఛార్మికి బీరు పోసిన వర్మ(వీడియో)

ఎనర్జిటిక్ హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత పూరికి ఓ రేంజ్ హిట్ దొరకడంతో సినిమా యూనిట్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ సమయంలో వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఏకంగా బీరు బాటిలో తో చీర్స్ కొట్టి.. బాటిల్ లోని బీర్ ను తలమీద పోసుకోవడంతోపాటు ఛార్మి ఒంటిపై పోసి ఆనందించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వర్మ ఆనందం వస్తే మరి ఇంతలా రెచ్చిపోతాడా అని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ కు ముందే తాను ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని ట్వీట్స్ చేశాడు వర్మ. అంతేకాదు బీర్ తెచ్చుకొని సినిమా చూస్తానని చెప్పాడు. మొత్తానికి వర్మ అన్నంత పని చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story