మరోసారి ఓవరాక్షన్ చేసిన రాంగోపాల్‌ వర్మ

మరోసారి ఓవరాక్షన్ చేసిన రాంగోపాల్‌ వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి ఓవరాక్షన్ చేశాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రామూ... బైక్‌పై ట్రిపుల్ రైడింగ్‌ చేశారు. అంతే కాదు.. అదేదో ఘన కార్యం చేసినట్లు... ఆ ఫోటోను ట్విట్టర్‌లో పెట్టుకున్నాడు. హెల్మెట్‌ లేకుండా.. ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ థియేటర్‌కు వచ్చామంటూ గొప్పగా చెప్పుకున్నాడు..

అంతే కాదు... థియేటర్‌లోకి వచ్చాక రాంగోపాల్‌ వర్మ జరుపుకున్న సంబరాలు సైతం వివాదాస్పదంగా మారాయి. షాంపైన్‌ పొంగించిన రామూ... దాన్ని తలపై నుంచి పోసుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నిర్మాత ఛార్మీతో కలిసి పండుగ చేసుకున్నాడు. హగ్గింగులు, కేరింతలతో అంతా ధూం ధాం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story