ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు

నెల్లూరు జిల్లా కోట మండలంలో ఉద్రిక్తత తలెత్తింది. కొత్తపట్నంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆ ఇండస్ట్రీకి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు గ్రామస్తులు వాదనకు దిగారు. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్తులు తోపులాటకు దిగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా కొత్తపట్నం గ్రామస్తులు నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపైకి కొందరు కుర్చీలు విసిరారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కువ మంది గ్రామస్తులు తోళ్ల పరిశ్రమ మాకు వద్దంటూ నినదించారు.
ప్రశాంతంగా ఉన్న ఊరు.. తోళ్ల పరిశ్రమ ఏర్పాటుచేస్తే.. కాలుష్యం బారిన పడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ మాకు వద్దు మొర్రో అంటున్నా ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారని అధికారులను నిలదీశారు. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు వ్యతిరేకంగా అరుపులు, కేకలతో వేదికను హోరెత్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

