21 July 2019 12:24 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / లావుగా ఉన్న మహిళలు...

లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరంటూ..

లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరంటూ..
X

లావుగా ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరట. ఈ మాట చెప్పిందెవరో కాదు.. ఏకంగా ఓ మత పెద్ద. ఇంకేముంది.. ఈ మాట వినగానే బొద్దుగా ఉన్న ఓ భామకు చిర్రెత్తుకొచ్చింది. పరుగెత్తుకుంటూ స్టేజి మీదకు వచ్చి... ఆ మతాధికారిని ఓ తోపు తోసింది. దీంతో ఆయన స్టేజి మీద నుంచి కిందపడిపోయారు...

బ్రెజిల్‌లోని సావోపౌలో చోటు చేసుకుంది ఈ ఘటన. 50 వేల మంది అనుచరులను ఉద్దేశించి ప్రవచనాలు చెబుతున్న మెర్సెలో రోసీ అనే మతాధికారి ఒక్కసారిగా మాట తూలారు. స్థూలకాయంతో ఉన్న మహిళలు స్వర్గానికి వెళ్లరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఉన్న ఓ మహిళ వెంటనే... పరుగెత్తుకుంటూ వచ్చి రోసీని బలంగా తోసేసింది... అయితే ఈ ఘటనలో రోసీకి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు.. ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది...

Next Story