ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత
X

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత రెంటపల్లి సుబ్బారెడ్డిని కాంట్రాక్ట్ ఉద్యోగి నందిని చెప్పుతో కొట్టడంతో గొడవ చోటు చేసుకుంది. నందిని కటుంబం కూడా వైసీపీకి చెందినవారే. తన ఉద్యోగం తీసేయించేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహంతో ఉన్న నందని..పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి చేసింది. అయితే..ఇద్దరు అధికార పార్టీ వారే కావటంతో రాజీకుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ బయట పెద్ద సంఖ్యలో ఇరువర్గాలు మోహరించటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Next Story

RELATED STORIES