బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

బాలిక దారుణ హత్య: తండ్రిపైనే అనుమానం!

మేడ్చల్‌ పట్టణంలో నిన్న జరిగిన మైనర్‌ బాలిక దారుణ హత్యకేసు మిస్టరీ వీడింది. కన్న తండ్రే కాలయముడై అత్యాచారం చేసి అతికిరాతకంగా చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందుతుడే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడు సుబ్రహ్మణ్యంకు ఇద్దరు భార్యలు. మృతురాలిని పెద్ద భార్య కుమార్తెగా గుర్తించారు పోలీసులు. సుబ్రహ్మణ్యంను అదుపులోతీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వీరి కుటుంబం మెదక్‌ జిల్లా తుప్రాన్‌ నుంచి మేడ్చల్‌ వచ్చింది.

మేడ్చల్‌లో ఇళ్ల మధ్య బాలిక మృతదేహం లభించడం నిన్న స్థానికంగా కలకలం రేపింది. ఎక్కడో చంపి ప్లాస్టిక్‌ సంచిలో కుక్కి రాత్రి ఇళ్లమధ్య వదిలివెళ్లారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. పంజాబీ డ్రెస్‌లో ఉన్న బాలిక ముఖం గుర్తుపట్టలేనంతగా పూర్తిగా ఛిద్రమైంది. చివరి కన్న తండ్రే

హతమార్చాడని తేలడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story