పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని..

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని..

నిండు గర్భిణి. పురిటి నొప్పులతో బాధపడుతోంది. అసలే మన్యం. ఆపై పెద్దాస్పత్రికి వెళ్లాలంటే వాహన సౌకర్యం లేదు. దీంతో పురిటి నొప్పులతో నరకయాతన పడుతున్న ఆ నిండు గర్భిణిని జోలె కావడిలో తరలించారు గ్రామస్తులు. మన్యంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన అందరిని కలచి వేస్తోంది.

విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన దేవి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో.. ఏకంగా 5 కిలోమీటర్లు జోలె కావడిలో మోసుకెళ్లారు గ్రామస్తులు. వర్షంలోనే తడుస్తూ అత్యంత కష్టంగా కేజే పురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది . ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు.ఈ ఘటన మన్యం వాసుల కష్టాలకు అద్దం పడుతోంది. సరైన సౌకర్యాలు లేక ఆదివాసులు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఆపద వస్తే సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోతే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే.

Tags

Next Story