ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మిషెల్లీ ఒబామా..

X
గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామా.... ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీకిచెందిన మహిళా ప్రతినిధులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇది నా అమెరికా, నీ అమెరికా కాదని, మన అమెరికా అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ దేశాన్ని ప్రపంచంలో గొప్పగా నిలబెట్టేది ఇక్కడి వైవిధ్యమే అంటూ ట్విట్టర్ ద్వారా ట్రంప్ కు చురకలంటించారు. ఇక్కడ పుట్టినవారైనా... వలసవచ్చిన వారైనా... ప్రతిఒక్కరికి ఈ నేలపై హక్కుందన్నారు. కొద్దిరోజులక్రితం ట్రంప్ డెమోక్రటిక్ మహిళా ప్రతినిధులను దేశం విడిచి వెళ్లిపోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడి మాటలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
