నాగార్జునకి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

నాగార్జునకి టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్

బుల్లి తెర మీద సెన్సేషనల్ షో బిగ్ బాస్. తొలి రెండు సీజన్స్ లో దుమ్మురేపిన ఈ షో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్.. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మొదలైపోయింది. బుల్లితెరపై ‘బిగ్ బాస్’ సందడి మాములుగా లేదు. బిగ్ స్క్రీన్ రోమాంటిక్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్‌గా మొదలైన ఈ షో 100 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచనుంది.

ఫస్ట్ సీజన్ లో తారక్, సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ లుగా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ వన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అందరిని మెప్పించాడు. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో షోని మరింత రక్తి కట్టించాడు. ఆ తర్వాతి సీజన్ కు హీరో నాని బిగ్ బాస్ కి హోస్ట్ గా సెలక్ట్ చేశారు. ప్రారంభంలో కొద్దిగా నిరాశ పరిచినా..ఆ తర్వాత నేచురల్ స్టార్ రియాల్టి షోను బాగానే ప్రజెంట్ చేశాడు.

బిగ్ బాస్ మొదటి సీజన్ 70 రోజులు ప్లాన్ చేశారు. 16 మంది హౌజ్ మేట్స్ తో ప్రారంభమైన షో.. ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించటంతో సక్సెస్ అయింది. సెకండ్ సీజన్ లో హౌజ్ లో ఉండాల్సిన గడువు 112 రోజులకు పెరిగింది. కంటెస్టెంట్ల సంఖ్యను కూడా 18కి పెంచారు. ఇప్పుడు మూడో సీజన్ 15 మంది కంటెస్టెంట్లతొ ఆదివారం మొదలైంది.

ఇక ఇప్పుడు మూడో సీజన్ చూస్తుంటే.. తొలి రెండు సీజన్లను బీట్ చేసేలా కనిపిస్తోంది. ‘కింగ్’ మూవీలోని సాంగ్ తో బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఫస్ట్ సీజన్ హోస్ట్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ వ్యాఖ్యాత నానిని గుర్తుచేసుకున్నారు. తారక్ ‘నా పెద్ద కొడుకు’.. నాని ‘నా గోల్డ్’ అంటూ తెలిపారు. తరువాత హౌజ్‌లోకి వెళ్లిన నాగార్జునకు.. ఆహ్వానం పలికిన బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్లలో మొదటి ముగ్గురినీ ఎంపిక చేయాలని నాగార్జునకు సూచించారు బిగ్ బాస్. దీంతో మూడు చిట్టీలను తీసి ముగ్గురు కంటెస్టెంట్లను నాగార్జున ఎంపిక చేశారు. ఈ ముగ్గురిలో ఫస్ట్ యాంకర్ శివజ్యోతి అలియాస్ ‘తీన్మార్’ సావిత్రిని వేదికపైకి పిలిచారు. ఆ తరవాత టీవీ నటుడు రవికృష్ణను రెండో కంటెస్టెంట్‌గా.. సోషల్ మీడియా సెన్సేషన్, నటి అశురెడ్డిని మూడో కంటెస్టెంట్‌గా ఆహ్వానించారు. ఆ తరవాత జర్నలిస్టు జాఫర్‌ను పరిచయం చేశారు. ఐదో కంటెస్టెంట్‌గా నటి హిమజ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది. 14, 15 కంటెస్టెంట్లుగా వచ్చిన హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story