క్రికెట్‌‌లో తెలంగాణ ఆటగాళ్ళకు అవకాశాలు ఎక్కడా?: టీసీఎ

క్రికెట్‌‌లో తెలంగాణ ఆటగాళ్ళకు అవకాశాలు ఎక్కడా?: టీసీఎ

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఢి అంటే ఢీ అంటోంది క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ. హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్లకే తరచూ అవకాశాలు వస్తున్నాయని.. ఇతర జిల్లాల్లో ఉన్న ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని పోరాటం చేస్తున్న క్యాట్.. జనరల్ బాడీ సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కొత్త క్లబ్ లు ఏర్పాటు చేసి.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని క్యాట్ డిమాండ్ చేస్తోంది.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తుంటే.. ప్రత్యర్థి క్రికెట్‌ సంస్ఠ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తన పోరాటంలో ఇంకాస్త దూకుడు పెంచింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని జిల్లాల్లో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని.. వాటికి ఓటింగ్‌లో పాల్లొనే అవకాశం ఇవ్వాలని క్యాట్‌ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా జిల్లాను హెచ్‌సీఎ నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని క్యాట్‌ వ్యవస్థాపక కార్యదర్శి సునీల్‌ బాబు మండిపడ్డారు. హైదరాబాద్‌ జంట నగరాలు, పక్కనే ఉన్న రంగా రెడ్డి నుండి మాత్రమే ఆటగాళ్లకు హెచ్‌సిఎ అవకాశం కల్పిస్తోందని.. ఇతర జిల్లాల క్రికెటర్లకు ప్రాతినిధ్యం లేకుండా చేయడం కరెక్టు కాదని నిలదీశారు..

ప్రస్తుతం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కింద 211 క్లబ్బులు ఉన్నాయని, ఇతర జిల్లాల్లో ఒక్క క్లబ్‌ కూడా ఎందుకు లేదని క్యాట్‌ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచే కాకుండా మిగిలిన జిల్లాలకు క్లబ్బులు కేటాయించి... సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆ క్లబ్‌లకు ఓటింగ్‌లో పాల్గొనే అవకావం కల్పించాలని సునీల్‌ బాబు డిమాండ్‌ చేశారు. తెలంగాణ జనాభా ప్రకారం ప్రతి జిల్లాలో కనీసం 100 క్లబ్‌లు ఉండాలని, ఆ క్లబ్‌లన్నింటికీ ఓటింగ్‌ ఉండాలని జనరల్‌ బాడీలో సునీల్‌ బాబు ప్రశ్నించారు.

క్రికెట్‌ లీగ్‌ల ఆశలు చూపించి.. క్లబ్‌ల తరుపున ఆటగాళ్లను ఆడించడానికి హెచ్‌సీఏ డబ్బులు వసూలు చేస్తోందని.. ఆటను ఒక వ్యాపారంగా మార్చేసిందని క్యాట్‌ ఆరోపిస్తోంది. హెచ్‌సీఏ పెద్దలకు మద్దతుగా నిలిచే కొన్ని క్లబ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. వారి నుండి ప్రతి ఏడాది డబ్బులు వసూలు చేస్తున్నారని.. అలాంటి వాళ్లను అసోసియేషన్‌ నుంచి తొలగించాలని క్యాట్‌ డిమాండ్‌ చేస్తోంది.

అసెంబ్లీ ముగిసిన తర్వాత ఇదే అంశంపై మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతిపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల స్వప్నమన్నారాయన. మొదటి నుంచి అమరావతిని కాంట్రవర్సీ చేస్తూనే వున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు. ప్రాజెక్టు రాకుండా అడ్డు పడుతూనే ఉన్నారని ఆరోపించారు. రాజధానిపై ప్రభుత్వమే చులకనగా మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు చంద్రబాబు. అమరావతి ప్రాజెక్టు రాకూడదనే పోరాడారని, ఇప్పుడు మామీద నిందలు వేస్తున్నారని విమర్శించారు. వరల్డ్‌ బ్యాంక్‌ ఎక్కడా అవినీతి గురించి ప్రస్తావించలేదని మరోసారి గుర్తు చేశారు చంద్రబాబు..

ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రా ప్రాంతంలో ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో ఈ ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. 9 అంతస్తులున్న ఈ భవనంలో 3,4 అంతస్తుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు వంద మందికి పైగా కార్యాలయ సిబ్బంది.... భవనం డాబాపై చిక్కుకున్నారు. 14 అగ్నిమాపక వాహనాలు ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నాయి.

ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇప్పటికి తెలియలేదు. అయితే.. షాట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు ఫైర్‌ సిబ్బంది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటల్ని ఆర్పుతున్నారు ఫైర్‌ సిబ్బంది. అలాగే డాబాపై చిక్కుకున్నవారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story