అంబటి రాయుడి ట్వీట్‌పై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్‌

అంబటి రాయుడి ట్వీట్‌పై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్‌

వరల్డ్‌ కప్‌లో చోటు దక్కలేదనే అసహనంతో హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు చేసిన త్రీడీ ట్వీట్‌ను తాను ఆస్వాదించానన్నారు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. రాయుడి భావోద్వేగాలను తాను అర్థం చేసుకున్నాన్నారాయన. జట్టు ఎంపికలో కొన్ని ప్రమాణాలు ఉంటాయని. ఎవరి విషయంలోనూ ద్వేషం, పక్షపాతం లేదని స్పష్టం చేశారు ఎమ్మెస్కే ప్రసాద్‌.

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడి త్రీడీ ట్వీట్‌పై స్పందించారు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌. రాయుడి భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనన్నారు. వ్యంగ్యం కూడిన ఆ ట్వీట్ బాగుందని కితాబిచ్చాడు ఎమ్మెస్కే ప్రసాద్‌. అయితే, తనకు ఎవరిపైనా ద్వేషం, పక్షపాతం లేదన్నాడు. అతడికి చాలా అవకాశాలిచ్చామని, అయితే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచకప్ తుది జట్టులోకి తీసుకోలేకపోయామన్నాడు ఎమ్మెస్కే ప్రసాద్‌.

ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో చోటు దక్కుతుందని చివరి వరకు ఆశలు పెట్టుకుని భంగపడ్డారు అంబటి రాయుడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోనిసెలక్టర్లు అతనికి మొండిచేయి చూపారు. రాయుడికి బదులుగా విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకాదు విజయ్ శంకర్ త్రీడీ ప్లేయర్ అంటు కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో రాణిస్తాడన్నాడు. అయితే.. ఎమ్మెస్కే వ్యాఖ్యలపై వ్యంగాస్త్రాలు సంధించాడురాయుడు. తానిప్పుడే 3డి కళ్లద్దాలకు ఆర్డర్ చేశానని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన ఎమ్మెస్కే ప్రసాద్‌.... జట్టు ఎంపికలో కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందన్నాడు. మొత్తానికి... త్రీడీ ట్వీటే రాయుడి క్రికెట్‌ కెరీర్‌ను‌ కొంపముంచిదనే చెప్పాలి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు అంబటి రాయుడు.

Tags

Read MoreRead Less
Next Story