అదిరే.. అదిరే.. 'కేటీఆర్' లుక్కే అదిరే..

అదిరే.. అదిరే.. కేటీఆర్ లుక్కే అదిరే..

మ్యాజిక్ మాయాజాలం. ఆకాశంలో చందమామని అరచేతిలోకి తీసుకు రావచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో అందరి ముఖాలు మార్చేయొచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేస్ యాప్ ఓ రేంజ్‌లో ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఫేసులన్నీ మారిపోతున్నాయి. రష్యాకు చెందిన వైర్‌లెస్ ల్యాబ్ కంపెనీ రూపొందించిన ఈ యాప్ నెట్టింట్లో సందడి చేస్తోంది.

ఎక్కువగా యూత్‌ని అట్రాక్ట్ చేస్తున్న ఈ ఫేస్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పని చేస్తుంది. ఫేస్ యాప్ ఆల్గరిథమ్ ఓ ఫోటోను తీసుకుని డీప్ జెనరేటివ్ కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్ ద్వారా కోరుకున్న విధంగా ఫొటోను తీసుకువస్తుంది. భవిష్యత్తులో ఎలా ఉంటారన్నది కూడా చూపిస్తుంది. జుట్టు రంగు, గడ్డం మార్చడం వరకు ప్రతిదీ యాప్ చేసేస్తుంది. అంతేకాదండోయ్, మగవారిని ఆడవారిగా, ఆడవారిని మగవారిగా కూడా మార్చేసే స్వాప్ జెండర్ ఫీచర్ కూడా ఉంది. పదేళ్ల తరువాత ఎలాఉంటాము.. స్టైల్ మారిస్తే మన ఫేస్‌కి సూటవుతుందా లేదా అనేది కూడా యాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక ఈయాప్‌ని ఇప్పటికే 10 కోట్లమందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. తాజాగా ఓ నెటిజన్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో ఫేస్ యాప్‌ ద్వారా మార్చేశాడు. అది చూసిన నెటిజన్లు.. మీరు గడ్డంతో చాలా హ్యాండ్సమ్‌గా కనబడుతున్నారు అంటూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ గడ్డంతో ఉన్న తనని తాను చూసుకుని .. నాట్ బ్యాడ్.. ఇలా కూడా బానే ఉన్నా అంటూ చమత్కరించారు.

Tags

Read MoreRead Less
Next Story