లష్కర్ బోనాలలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

లష్కర్ బోనాలలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగానే పడతాయని భవిష్యవాణి చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. భక్తుల్ని సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని.. ఈ ఏడాది ఉత్సవాలు జరిగిన తీరుపట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. గంగాదేవికి జలాభిషేకం చేస్తే.. అందరి కోర్కెలు నెరవేరుతాయని వివరించింది. 5 వారాలపాటు నాకు శాఖలు పోయాలని చెప్పింది. మరోమారు మారు బోనం సమర్పించాలని కోరింది.

సోమవారం రంగం కార్యక్రమం తర్వాత మహంకాళి అమ్మవారి గజారోహణం ఉంటుంది. ఏటా ఈ ఉత్సవానికి రజినీ అనే ఏనుగు ఉపయోగించేవారు. అది ముసలిది అయిపోవడంతో ఇప్పుడు కొత్తగా గుల్బర్గా నుంచి ఏనుగును తీసుకొచ్చారు. దానిపై అమ్మవారి ఊరేగింపు జరగనుంది. రాత్రికి ఫలహార బండ్ల ఊరేగింపుతో బోనాలు ముగుస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story