ఏపీలో నిలిచిపోయిన 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులు

ఏపీలో నిలిచిపోయిన 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులు
X

ఏపీలో 108 ఎమెర్జెన్సీ అంబులెన్స్‌ సర్వీసులు నిలిచిపోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 108 సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమకు కనీస వేతనాలు లేవని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. వైద్యో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరితో చర్చలు జరిపారు 108 సిబ్బంది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు సమయం కోరిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి సమ్మెపై ప్రకటన చేస్తామన్నారు. అప్పటివరకు సమ్మె కొనసాగుతుందన్నారు.

Tags

Next Story