ఆంధ్రప్రదేశ్

బీసీ నాయకుణ్ని సస్పెండ్‌ చేసి బీసీలకు ఎలా న్యాయం చేస్తారు : చంద్రబాబు

బీసీ నాయకుణ్ని సస్పెండ్‌ చేసి బీసీలకు ఎలా న్యాయం చేస్తారు : చంద్రబాబు
X

సీఎం జగన్‌ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్‌ పెన్షన్ల విషయంలో మాట ఎందుకు మార్చారని ప్రశ్నించారు. పాద యాత్ర సమయంలో జగన్‌ ఇచ్చిన హామీని గుర్తు చేసిన చంద్రబాబు.. బీసీ, ఎ స్టీ, ఎస్సీ మహిళలకు 45 ఏళ్లకు పెన్షన్‌ ఇస్తామన్న ఆయన.. ఇప్పుడు అలా అనలేదని మాట మార్చడాన్ని తప్పు పట్టారు.

అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఉందని.. సభలో నిలదీస్తున్నందుకు సభ్యులను సస్పెండ్‌ చేయడం సరైందేనా అని నిలదీశారు.. ఒక బీసీ నాయకుణ్ని సస్పెండ్‌ చేసి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES