పెంపుడు శునకం కిడ్నాప్‌.. పోలీసులకు ఫిర్యాదు

పెంపుడు శునకం కిడ్నాప్‌.. పోలీసులకు ఫిర్యాదు
X

సికింద్రాబాద్‌ సైనిక్‌పురి పోలీసులకు ఓ కాల్‌ వచ్చింది. హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. వంశీ అనే వ్యక్తికి చెందిన పెంపుడు శునకం కిడ్నాప్‌ అయింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి శునకాన్ని అపహరించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం కిడ్నాప్‌ అవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. యజమాని వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫూటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags

Next Story