నేను నటించడం వారికి ఇష్టం లేదు.. చచ్చిపోతామంటూ బెదిరించేసరికి..

నేను నటించడం వారికి ఇష్టం లేదు.. చచ్చిపోతామంటూ బెదిరించేసరికి..

సూపర్ స్టార్ కృష్ణ కూతురిగా గుర్తింపు. అందాల రాకుమారుడు మహేష్ బాబుకి అక్క. ఆ పరిచయంతో సినిమాల్లో ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తుంది మంజుల. బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే కూడా వదులుకుంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం టాప్‌హీరో. అందులో కథానాయికగా ముందు మంజులని అనుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే కృష్ణ ఫ్యాన్స్ మంజుల సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు అని మంజుల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఓ రోజు నాన్నగారి ఫ్యాన్స్ నల్లముసుగులు వేసుకుని, పెట్రోల్ క్యానులు పట్టుకుని స్టూడియోకు వచ్చి మంజుల సినిమాల్లో నటిస్తే తగలబెట్టుకుని చచ్చిపోతాం అని గొడవ చేశారు. నాన్నగారు ఓకే అనేవరకు వాళ్లు అక్కడినుంచి కదల్లేదు. నన్ను వాళ్ల ఇంటి ఆడపడుచుగా భావించి నేను సినిమాల్లో నటించడానికి ఇష్టపడలేదు అంతే అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తరువాత ఆమె షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు చిత్రాల్లో నటించారు. నిర్మాతగా కూడా మారి పోకిరి, ఏమాయ చేసావే వంటి చిత్రాలకు పని చేశారు మంజుల. గత ఏడాది మనసుకు నచ్చింది చిత్రానికి దర్శకత్వం వహించి దర్శకురాలిగా కూడా మారిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story