రాజకీయ కక్షలు.. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

టీడీపీ కార్యకర్తలపై వైపీపీ వర్గీయుల దాడులు ఆగడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తుబాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగాయపడిన వ్యక్తికి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే కక్షతో తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని బాధితులు వాపోయారు. తుబాడు గ్రామంలో 40 మంది యాదవుల ఇళ్ల మధ్య దూదేకులకు చెందిన నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వీరిలో యాదవులు అంతా వైసీపీకి చెందిన వారు కాగా .. దూదేకుల వారు తెలుగుదేశంపార్టీకి చెందిన వారు. టీడీపీ ఎందుకు ఓటు వేశారంటూ వైసీపీ వర్గీయులు తమపై దౌర్జన్యానికి దాడికి దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com