ఆంధ్రప్రదేశ్

హృదయ విదారక ఘటన.. గర్భిణిని డోలిలో 8 కి.మీ. మోసుకెళ్లిన కుటుంబం

హృదయ విదారక ఘటన.. గర్భిణిని డోలిలో 8 కి.మీ. మోసుకెళ్లిన కుటుంబం
X

మన్యంలో గిరిజనుల పడుతున్న కష్టాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ హైటెక్ యూగంలోనూ వైద్యం వారికి అందని ద్రాక్షగానే మారుతోంది. చికిత్స కోసం ప్రాణాలను పణంగా పెట్టి కొండా, కోన దాటి రావడానికి పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. గుండె తరక్కుపోతోంది. మొన్న విశాఖజిల్లా కొత్తవలసలో నిండు గర్భిణిని డోలిలో 5 కిలోమీటర్లు మోసుకెళ్లారు. పాలకుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిలువెత్తు సాక్షంగా నిలిచింది. ఇప్పుడు విజయనగరం జిల్లా మన్యంలోనూ ఇదే తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం గడ్డపాడు గ్రామానికి చెందిన సీతమ్మ అనే గర్భిణిని డోలీలో 8 కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఎస్. కోట ప్రభుత్వాసుపత్రిలో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది . అయితే అధికారులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా చేశారు. గడ్డపాడు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. అత్యవసరంగా వైద్యం అవసరమైన వారిని ఇలా డోలిల్లోనే తీసుకెళ్తుంటారు. కొండలు, గుట్టలు దాటుకుండా ఆ రాళ్లమార్గంలో వెళ్లేసరికే చాలా ఆలస్యం జరిగిపోతోంది. దీంతో పలువురు మార్గమధ్యంలోనే మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES