ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం

ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం
X

మంగళవారం ఏపీ అసెంబ్లీ కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పలు బిల్లులను ఆమోదించింది. అలాగే శాశ్వత బీసీ కమిషన్‌‌ను ఏర్పాటుకు అడుగులు వేస్తూ మరో బిల్లును పాస్ చేసింది. దీనిపై చర్చ అనంతరం బిల్లులకు ఆమోద ముద్ర పడ్డాయి.

ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో జగన్ బిల్లులు రూపొందించి కేబినెట్‌లో పెట్టారు. మంత్రివర్గం ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించారు. అనంతరం బిల్లును ఆమోదించారు.

ప్రతిపక్షం టీడీపీ సభ నుంచి వాకౌట్ చేయడంతో.. కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే బిల్లులపై చర్చించారు. ఆ తరువాత బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లులు శాసన మండలిలో ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారతాయి. మరోవైపు నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించడంపై మహిళా శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగుతుందన్నారు వైసీపీ సభ్యులు.

Next Story

RELATED STORIES