ఆంధ్రప్రదేశ్

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం
X

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రతిపక్షనేత చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీజే, సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులను గవర్నర్‌కు పరిచయం చేశారు సీఎం జగన్‌ .

Next Story

RELATED STORIES