విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. పై చదువులకోసం స్కాలర్‌షిప్..

ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు సహకరించక మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకు చేయూతనందిస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా విభాగం ఈ స్కాలర్‌షిప్స్ పథకాన్ని అమలు చేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరానికి జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఉంటాయి. స్కాలర్‌షిప్‌కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే రాష్ట్ర విద్యామండలిలోని నోడల్ ఆఫీసర్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. నోడల్ ఆఫీసర్ల వివరాలు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో 'Services' సెక్షన్‌లో ఉంటాయి. మొదటిసారి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసేవాళ్లు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన వివరాలతో రిజిస్ట్రేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. 18 ఏళ్ల లోపు విద్యార్థులైతే వారి తల్లిదండ్రులు ఈ ఫామ్ నింపాలి. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కొడ్, ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా బోనఫైడ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ లాంటి కాపీలు అన్నీ సిద్దంగా ఉంచుకుని దరఖాస్తుకు అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికి 2019 అక్టోబర్ 31 చివరి తేదీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com