మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మాధవన్‌‌కు యువతి ప్రపోజల్‌

మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. మాధవన్‌‌కు యువతి ప్రపోజల్‌

వయసు పెరుగుతున్న మాధవన్‌ మాత్రం ఇంకా లవర్ బాయ్ గానే కనిపిస్తున్నాడు. సఖి సినిమాతో యువ హృదయాలను ఎంత మెస్మరైజ్ చేశాడో అందిరికి తెలిసిందే. ఇప్పటికీ ఆ హీరోకు ఆమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా ఓ యువతి ఆయనపై మనసు పారేసుకుంది. మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ సెల్ఫీకి ఆ అమ్మాయి చేసిన కామెంట్ ఆయన అమ్మాయిల గుండెల్లో ఇంకా ఎంత పదిలంగా ఉన్నాడో చెప్పకనే చెబుతుంది. మాధవన్‌ ఓ సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ "ఎడిటింగ్ క్రియేటివిటికి సంబంధించింది. అది మెలుకువలతో కూడుకున్నది. అది కష్టం, తృప్తితో కూడుకున్నది. అది ఫన్నీగా కూడా ఉంటుంది. సుదూర ప్రయాణం చేశాను. నేను వృద్ధుడిని అయిపోతున్నాను"అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ఈ పోస్ట్‌పై స్పందించిన ఓ అమ్మాయి "నాకు 18 ఏళ్లు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తప్పంటారా?’ అని ప్రశ్నించింది. దీనికి మాధవన్ రిప్లై ఇస్తూ ‘హ్హ హ్హ.. గాడ్‌ బ్లెస్‌ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. అలాగే అనుష్కకు జోడీగా ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story