కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగిన కుటుంబం

కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగిన కుటుంబం

ఉద్యోగం లేదని, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించి ఆయన భార్య, పెద్ద కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన మిర్యాలగూడలో తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన పారేపల్లి లోకేష్‌ గత కొద్దికాలంగా ఉద్యోగం రాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఇక ఆత్మహత్యే శరణ్యమని భార్య, పెద్ద కుమారుడితో సహా కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్‌ మృతి చెందారు. లోకేష్‌ పరిస్థితి విషమంగా ఉంది.

తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హైదరాబాద్‌లో ఉన్న సోదరికి లోకేష్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వెళ్లేలోపు లోకేష్‌ కుటుంబం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తన పరిస్థితి బాగోలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ లెటర్‌ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చిన్నకుమారుడు రోహిత్‌, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story