కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

నిజామాబాద్‌ నగరంలోని ముజాహిద్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు రియాజ్‌, మహ్మద్‌గా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం నుంచి వీరు కనిపించకుండా పోయారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో కారు వద్దకు వెళ్లి గమనించగా చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. అయితే.. రియాజ్‌, మహ్మద్‌ల మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఇద్దరు పిల్లల్లో రియాజ్ వయసు 10 ఏళ్లు. ఆ వయసు పిల్లలకు కారు డోర్ తెరవడం వస్తుందని, కానీ ఘటన జరిగిన తీరు చూస్తే ఇది ప్రమాదవశాత్తూ జరిగినట్టుగా తమకు కనిపించడం లేదని చెప్తున్నారు.

లాక్‌ వేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లారు, అర్థరాత్రి కారు ఓనర్ ఎందుకు దాని దగ్గరకు వెళ్లి చూశారు.. అప్పుడే ఈ విషయం ఎలా బయటపడింది అనే దానిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారుల పోస్ట్‌మార్టం కోసం డెడ్‌బాడీల్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story