అక్రమ సంబంధం పెట్టుకుందని కుక్కని ఇంట్లో నుంచి తరిమేశాడు

అక్రమ సంబంధం పెట్టుకుందని కుక్కని ఇంట్లో నుంచి తరిమేశాడు
X

చాలా మందికి శునకాలు అంటే ఇష్టం. పిల్లలతో పాటు వాటిని ముద్దు చేస్తుంటాం. మనం గారాబం చేసే పిల్లలు మాట వినలేదంటే కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అలాంటిది ఇంట్లో పెరిగే శునకాలు కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే మాత్రం తీవ్ర కోపాలు వస్తుంటాయి. ఆ కోపంతో వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం లేదా ఏ యానిమల్ ప్రొటెక్షన్ హౌస్‌కో పంపించి వేస్తాం. కానీ ఓ యజమాని తన కుక్కను ఎందుకు వదిలించుకున్నాడో తెలిస్తే షాక్ అవాల్సిందే. తన కుక్క మరో కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని కోపంతో దాన్ని ఇంట్లోంచి తరిమేశాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.

ఆ కుక్క వీధుల్లో తిరుగుతూ మెురుగుతుడడంతో స్థానికులు పీఎఫ్ఏ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం అందుకున్న వారు కుక్కను తీసుకుని సంస్దకు తరిలించారు. అనంతరం దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో వారికి దాని మెడలో ఓ బోర్డు వారికి కనిపించింది. దాన్ని చదివిన వారు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. అందులో ఏముందంటే.. ‘ఈ కుక్క అంటే నాకెంతో ఇష్టం. ఇది మూడేళ్లు వయసు నుంచి నా దగ్గర పెరిగింది. దానికి మొరగడమే తప్ప ఇంతవరకు ఒక్కరిని కూడా కరవలేదు. దానికి ఇష్టమైన ఆహరాన్ని ఇచ్చి ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. కానీ వీధుల్లో తిరిగే ఒక వీధి కుక్కతో అది అక్రమ సంబంధం పెట్టుకుంది. అది నాకు నచ్చలేదు. అందుకే దీన్ని వదిలించుకుంటున్నాను’ అని రాశాడు. దాన్ని చదివిన వారికి తెరుకోడానికి చాలా సమయమే పట్టింది.

Tags

Next Story