108 సిబ్బంది సమ్మె.. ఆటోలోనే ప్రసవించిన మహిళ

X
ఏపీలో 108 సిబ్బంది సమ్మె కొనసాగుతోంది. అంబులెన్స్‌లు కదలకపోవడంతో ఎమర్జెన్సీ రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో ఓ మహిళ ఆటోలోనే పురుడు పోసుకోవాల్సి వచ్చింది.
కర్నూలు జిల్లా కారుమంచికి చెందిన శిరీషకు పురిటి నొప్పులు మొదలవగానే.. 108 నెంబర్‌కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవతలి నుంచి స్పందన లేకపోయింది. దీంతో ఆటోలో ఎమ్మిగనూరు ఆస్పత్రికి బయల్దేరారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో ఆటోను రోడ్డు పక్కన నిలిపారు. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
