ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీ గేటు బయట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన

తమ సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ అసెంబ్లీ గేటు బయట టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. సభను నడిపించేది స్పీకరా.. ముఖ్యమంత్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ ఏకపక్ష వైఖరి వీడాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్‌ రాజకీయ దాడులు చేస్తోందంటూ విమర్శించారు. అసెంబ్లీ గేటు బయట జరిగిన ఆందోళనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం పాల్గొన్నారు. సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

Next Story

RELATED STORIES