సికింద్రాబాద్ స్వప్న హోటల్లో తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్ స్వప్న హోటల్లో తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్ స్వప్న హోటల్లో ఘోర ప్రమాదం తప్పింది. వంట చేస్తుండగా సిలిండర్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కస్టమర్లంతా భయంతో పరుగులు తీశారు. ‌అయితే ధైర్యంగా వ్యవహరించిన హోటల్ మాస్టర్.. మంటలు ఎగిసిపడుతున్న సిలిండర్‌ను బయటకు తీసుకొచ్చాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మంటల్ని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. హోటల్ మాస్టర్‌ తెగువను అందరూ ప్రశంసించారు.

Tags

Read MoreRead Less
Next Story